AP: నెల్లూరు జిల్లా సంగం వద్ద రన్నింగ్‌లో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింది భాగంలో సడన్‌గా మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ నాగార్జున వెంటనే అప్రమత్తమై తన బైకుపై బస్సు ముందుకు వెళ్లి డ్రైవర్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే బస్సును ఆపిన డ్రైవర్ 45 మంది ప్రయాణికులను క్షేమంగా దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజన్ ఆపడంతో మంటలు పూర్తిగా ఆగిపోయాయి. అప్రమత్తంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నాగార్జునకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.