AP: విశాఖపట్నం సీ హార్స్ జంక్షన్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.