నేడు తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ జలప్రవేశం

AP: విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను జలప్రవేశం చేయించనున్నారు. ఈ సందర్భంగా FSS-5కు శంకుస్థాపనతో పాటు భారీ గోలియత్ క్రేన్, స్లిప్‌వే-4ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేవీ చీఫ్ కూడా పాల్గొంటారు. 43,500 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ నౌకలు భారత నావికాదళానికి అదనపు బలాన్ని చేకూరుస్తాయి, ఇవి యుద్ధనౌకలకు నడిసంద్రంలో ఇంధనాన్ని అందించగలవు.

సంబంధిత పోస్ట్

✕
✕