AP: రాష్ట్రవ్యాప్తంగా గురువారం మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 3,191 సర్పంచ్ స్థానాలు, 25,061 వార్డులతో పాటు పెండింగ్ ఉన్న 23 మున్సిపాలిటీలలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ప్రచారం ముగియడంతో అక్రమాలను నిరోధించేందుకు డీజీపీ హరీశ్ గుప్తా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శాంతియుత పోలింగ్ కోసం మొత్తం 46,350 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.