AP: విజయవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో, మిగతా ఐదుగురికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం అరెస్టైన వారి సంఖ్య 12కి చేరింది. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.