ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ లభ్యం

AP: విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఐదుగురి ఆచూకీని గుర్తించారు. ఈనెల 1న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరిలో, కారె చిన్నాను వాణిజ్య నౌక సిబ్బంది కాపాడారు. వాణిజ్య నౌక ఎక్కలేకపోయిన నలుగురి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే, ఆచూకీ తెలియని మరో ఇద్దరు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్