ఏపీలో భారీ వర్షాల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ (IMD) ఏడు జిల్లాలకు ఆకస్మిక వరదల (Flash Flood) ముప్పు ఉందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో ఉదయం 11:30 గంటలలోపు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు ఆదేశించారు.