AP: పల్నాడు జిల్లా యడ్లపాడులో మరోసారి ఫ్లెక్సీల విషయంలో కలకలం రేగింది. వైఎస్సార్ వర్ధంతి, పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ, కూటమి వర్గాల మధ్య ఫ్లెక్సీల పోరు మొదలైంది. '2029లో జగన్ మళ్లీ సీఎంగా వస్తారు.. ఆపండి' అని వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, దానికి ప్రతిస్పందనగా 'రాడు.. రానీయం' అంటూ కూటమి వర్గాలు కౌంటర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ రాజకీయ పోరు స్థానికంగా చర్చనీయాంశమైంది.