వరద ప్రవాహం.. అప్పటివరకు అప్రమత్తంగా ఉండండి: APSDMA

AP: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని APSDMA తెలిపింది. ప్రస్తుతం ఇన్-ఫ్లో, అవుట్-ఫ్లో కలిపి 5.29 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు పేర్కొంది. అయితే రేపటి నుంచి వరద నీరు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీటిలో ఈత కొట్టడం, చేపలు పట్టడం, ప్రయాణించడం లేదా స్నానం చేయడం ప్రమాదకరమని, ప్రజలు అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్