AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి రోజా సంచలన ఆరోపణలు చేశారు. ‘కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది. పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో 500 మందికి రూ.10 లక్షలు ఇస్తానన్నారు. అది ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు. పవన్ వాళ్ల అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ ఇప్పించుకొని.. మంత్రిని చేసుకోవడానికి తపన పడుతున్నారు. పవర్‌లోకి వచ్చాక ఫ్లవర్ పెట్టారు.’ అని రోజా విమర్శించారు.