AP: కడప పురపాలక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్ నిర్మాణం పూర్తయింది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నిధులు సమకూర్చారు. ఈ వంటశాల ద్వారా 12 పాఠశాలల్లోని 2,200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. ఎక్స్ వేదికగా తాజాగా స్మార్ట్ కిచెన్‌పై పవన్ కళ్యాణ్ స్పందించారు. స్మార్ట్ కిచెన్ సిద్ధమైందని, ఈ కిచెన్‌తో 12 పాఠశాలలకు ఆహారం సరఫరా జరుగుతుందని పవన్ పేర్కొన్నారు.