54 ఏళ్లుగా.. ఒకే కుటుంబం నుంచి సర్పంచులు

AP: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని పోలేపల్లి గ్రామ పంచాయతీలో 54 ఏళ్లపాటు ఒకే కుటుంబానికి చెందిన వారు సర్పంచులుగా సేవలందించడం విశేషం. 1952 మే 14న ఏర్పాటైన ఈ పంచాయతీకి తొలి సర్పంచిగా పెద్దిరెడ్డి చెన్నప్ప ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కుమారులు అంజినప్ప, చంద్రశేఖర్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్‌తో శ్రీరాములు, చంద్రశేఖర్ భార్య లక్ష్మిదేవి సర్పంచులుగా పనిచేశారు. ఎస్సీ రిజర్వేషన్ కారణంగా ముత్యాలమ్మ ఎన్నికయ్యారు. 2020 నుంచి 2026 వరకు అభిలాష సర్పంచిగా కొనసాగారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో చంద్రశేఖర్ టీడీపీ తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే రెండుసార్లు సర్పంచిగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕