జగన్ ఆనందం కోసం.. నా పంటను నాశనం చేశారు: రైతు ఆవేదన(వీడియో)

AP: మాజీ సీఎం జగన్ బుధవారం బంగారుపాళ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మామిడి పండ్లను రోడ్డుపై పారబోసి రచ్చ చేశారు. వాటిని తొక్కుకుంటూ ఆ పార్టీ శ్రేణులు వీరంగం సృష్టించారు. దీనిపై బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. జగన్ కళ్లలో ఆనందం కోసం, తన పంటను అమ్ముకోకుండా చేశారని.. తనను చావు దెబ్బ కొట్టారని వాపోయారు. పంటను నాశనం చేయడంపై కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్