ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల బిల్లు సమయంలో కెమెరాలు కట్‌ చేశాక జరిగిన పరిణామాలపై తొలిసారి మాట్లాడారు. ఒక మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి దూషించారని, శాసనమండలినే రద్దు చేస్తామని YCP సభ్యులు బెదిరించారని ఆయన తెలిపారు. తనకున్న అధికారంతో 3 రాజధానుల బిల్లును ఆమోదించలేదని, ఎన్ని బెదిరింపులొచ్చినా ధర్మం వైపు నిలబడ్డానని అన్నారు. ఇప్పుడు అమరావతిని రాజధానిగా చట్టం చేస్తుండటం సంతోషంగా ఉందని షరీఫ్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్