AP: విజయవాడలోని కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణ ముగిసింది. ఏడు రోజుల పాటు నాగరాజును సిట్ అధికారులు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం మాజీ సీఐ నాగరాజును విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. కాగా సాయికృష్ణ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.