AP: మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, లేదంటే ప్లేస్, ఫేట్ మారుతుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. తన వద్ద ప్రభుత్వ వైఫల్యాల చిట్టా ఉందని కూడా చెప్పినట్లు టాక్. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.