వైసీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి మాజీ సీఎం జగన్ బయల్దేరారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమురెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి ఫర్నీచర్, కారు ధ్వంసమైంది. దీంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అనంతరం జగన్ ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి బయల్దేరారు.