AP: ఎంపీ మిథున్ రెడ్డికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి టీడీపీ మూకల దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదని, ఓటమి భయంతోనే అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ లా మార్చారని, లోక్సభ పార్టీ నాయకుడికే భద్రత లేదని, చంద్రబాబు అధికార దుర్వినియోగంతో పోలీసులను వాడుకుని అక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయని, ఇదే విషయాన్ని కోర్టుల ముందు ఉంచుతామని జగన్ పేర్కొన్నారు.