AP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 10 గంటలకు విజయవాడలో పర్యటించనున్నారు. సీఐ నాగరాజు వేధింపుల కారణంగా సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా క్రాంతి కుటుంబానికి తన మద్దతును తెలియజేయనున్నారు.