AP: వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా, తాజాగా హిందూపురం వైసీపీ మాజీ అధ్యక్షుడు బుక్కపట్నం నవీన్ నిశ్చల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన ఫ్యాక్స్ ద్వారా అధిష్ఠానానికి రాజీనామా లేఖ పంపారు. ఏడాది క్రితం సస్పెన్షన్కు గురైన నవీన్ నిశ్చల్, అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో హిందూపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ఆయన, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆగ్రోస్ చైర్మన్గా పనిచేశారు.