AP: కూటమి ప్రభుత్వం శ్రీకాకుళాన్ని వెనుకబడిన ప్రాంతంగానే చూస్తోందని, అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్లు అప్పు చేసినా, శ్రీకాకుళం జిల్లాకు రూ.1000 కోట్లు కూడా కేటాయించలేదని ప్రశ్నించారు. 20 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు మేలు జరిగిందని, మూలపేట పోర్టు నిర్మాణం కూడా వారి హయాంలోనే ప్రారంభమైందని తెలిపారు.