కోర్టుకు మాజీమంత్రి కారుమూరి

AP: మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు ఆదివారంఅరెస్ట్ చేశారు. ఈక్రమంలో ఆయనను మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్‌కుమార్‌, వాసుదేవరెడ్డి, రాజ్‌కెసిరెడ్డిలను అరెస్ట్ చేశారు. మద్యం రవాణా కాంట్రాక్టులో భారీ అక్రమాలు జరిగాయని, అందులో పెద్దమొత్తం లబ్ధి పొందినట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. సునీల్‌కుమార్‌ ఇంట్లో రోలెక్స్‌ వాచీలు, రేంజ్‌రోవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కారుమూరికి చెందిన 87.7 కోట్ల ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕