AP: మాజీ మంత్రి విడదల రజిని వైసీపీని వీడనున్నారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు మారి పోటీ చేసి ఓటమి పాలైన రజినిని, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపల్లె నియోజకవర్గానికి వెళ్లమని ఆదేశించినట్లు సమాచారం. అయితే, దీనికి రజిని ససేమిరా అనడంతో పార్టీ మార్పుపై చర్చ ఊపందుకుంది. ఈ విషయంపై ఇప్పటివరకు రజిని నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు.