మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు!

AP: ఆడుదాం ఆంధ్రా పథకంలో అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక సంచలనం వెలువడింది. రూ. 40 కోట్ల అంచనాతో మొదలైన ఈ పథకంలో రూ. 125 కోట్లు చేరగా, రూ. 40 కోట్లు దుర్వినియోగం అయినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నివేదిక సిఫారసు చేసింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. పేద క్రీడాకారుల పొట్ట కొట్టారని, తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. దీంతో వారు త్వరలో అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్