ఎక్స్ వేదికగా మాజీ మంత్రి రోజా విమర్శ

AP: మాజీ మంత్రి రోజా 'X' వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ప్రజలు గంటల తరబడి పెట్రోల్ బంకుల ముందు నిలబడుతుండగా, రాజధాని కాంట్రాక్టర్లకు రిటైల్ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. మిగతా ప్రాంతాల ప్రజల కష్టాలు మీకు కష్టాలుగా కనిపించడం లేదా అని సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్