మాజీ మంద్రి సీదిరి అప్పలరాజు విడుదల

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణ ముగిసిన అనంతరం విడుదల చేశారు. సుమారు 7 గంటల పాటు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో సీదిరి అప్పలరాజును పోలీసులు విచారించారు. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, కూటమి ప్రభుత్వ తప్పిదాలపై గతంలో మాట్లాడినందుకు తనపై కేసు నమోదు చేశారని సీదిరి అప్పలరాజు అన్నారు. కాగా, ఏడాది క్రితం కేసు నమోదు చేసి విచారణ కోసం తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్