కర్నూలులో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై దాడి!

AP: కర్నూలులో స్థానిక ఎన్నికల ప్రచారం సందర్భంగా YCP, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్‌ ఖాన్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. 16వ వార్డులో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల రాకతో దుండగులు పరారయ్యారు. బెదిరింపులకు భయపడేది లేదని హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడగాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕