నంది అవార్డులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెటైర్స్..!

ఏపీలో తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ప్రకటనపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరువు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే, రూ.15.28 కోట్లు ఖర్చు చేసి అవార్డుల వేడుకలు చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఈ అవార్డుల కోసం డిసెంబర్‌లో విజయవాడ లేదా అమరావతిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలను విస్మరించి ప్రభుత్వం సినిమా అవార్డులకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕