టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. సుమారు 40 ఏళ్లుగా పార్టీలో ఉన్న ఆమె, పార్టీలో అవమానాలను భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావోద్వేగంతో వెల్లడించారు. గురువారం తన అనుచరులతో కలిసి ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕