AP: తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం నుంచి వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై జేసీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో పెద్దారెడ్డికి చెందిన సుమారు 10 వాహనాలు ధ్వంసమయ్యాయి, అలాగే 20 బైకులకు నిప్పు పెట్టారు. ఇంటిలోని అద్దాలు, ఫర్నిచర్ కూడా ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల పట్ల పోలీసులు స్పందించడం లేదని, టీడీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.