టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గుడ్ బై?

AP: సీఎం చంద్రబాబుకు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో టీడీపీకి కష్టకాలం మొదలైనట్లు తెలుస్తోంది. టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014-19 మధ్యకాలంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రభాకర్ చౌదరి కొనసాగారు. మున్సిపల్ ఛైర్మన్‌గా కూడా సేవలందించారు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి అధిష్టానం ఆయనను తొలగించింది. పార్టీలో ప్రాముఖ్యత లేదని, అందుకే ఆయన టీడీపీని వీడుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్