AP: కడప జిల్లా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. గతంలో కమలాపురం టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన, వివిధ సమయాల్లో టీడీపీ, వైసీపీల మధ్య మారుతూ వచ్చారు. కాగా, వీరశివారెడ్డి గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా ఆయన బీజేపీ కండువా కప్పుకుని కాషాయ గూటికి చేరారు.