మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ రాజీనామా

AP: కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. సీనియర్ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకుడు నెక్కంటి సాయిప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవుల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕