కళాశాల సిబ్బందిపై మాజీ ప్రిన్సిపల్ కొడుకు కత్తితో దాడి

AP: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని ఐటీఐ కాలేజీలో ఘర్షణ చోటుచేసుకుంది. కళాశాల సిబ్బందిపై మాజీ ప్రిన్సిపల్ కొడుకు జిలానీ కత్తితో దాడి చేశారు. దాడిలో కమిటీ సభ్యుడు హుస్సేన్ మృతి చెందగా.. ప్రిన్సిపల్ శేషయ్యకు గాయాలయ్యాయి. కాగా, మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్, కమిటీ సభ్యుల మధ్య కొన్నాళ్లుగా వివాదం ఉంది. ఆర్థిక లావాదేవీల వివాదాల వల్లే దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్