సిట్ విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఈవో

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళవారం సిట్ అధికారులు విచారించారు. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. ధర్మారెడ్డి ఈవోగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు అంశాలపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, గతంలో టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్