వైసీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కీలక బాధ్యతలు

AP: మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుకు వైసీపీకి కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావుకు మంచి పట్టు ఉండటంతో..  హైకమాండ్ ఉత్తరాంధ్రాలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక పదవిలో ఆయనను ఉంచాలని చూస్తోందట. అయితే మరోవైపు, ధర్మాన తన కుమారుడిని వారసుడిగా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని, పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అయితే, అధినాయకత్వం బాధ్యతలు అప్పగిస్తే ఆయన అంగీకరిస్తారని కూడా చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్