AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘటనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ కారు ధ్వంసం అయింది. మాజీ ఎమ్మెల్యే కారు ధ్వంసం కావడం రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటనను వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ‘చలో నర్సీపట్నం’ కార్యక్రమానికి వైసీపీ పిలుపునివ్వగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది.