AP: నంద్యాలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి , శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలింగ్ వేళ ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గృహ నిర్భందం చేశారు. వైసీపీ మండల నాయకులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.