AP: అనంతపురం జిల్లా కేఎస్‌ఆర్ జూనియర్ కాలేజీలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు ఒకేసారి హెయిర్ డై తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చదువులో సరిగ్గా రాణించలేదనే కారణంగా వార్డెన్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా, పేరెంట్స్ వారిని మందలించారు. దీంతో మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. చదువు ఒత్తిడి, మానసిక భారమే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.