AP: కంప్యూటర్ దీదీ పథకం కింద ప్రతి పంచాయతీలో డ్వాక్రా మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన డ్వాక్రా సభ్యురాలికి ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు అందిస్తారు. ఫర్నిచర్ కొనుగోలుకు సెర్ప్ ద్వారా రుణం ఇప్పిస్తారు. రెండేళ్లపాటు నెలకు రూ.6 వేల చొప్పున అందేలా పలు కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు. డ్వాక్రా మహిళలకు డిజిటల్ శిక్షణ ఇచ్చేందుకు అవకాశం కల్పించి, ప్రోత్సాహకం కూడా చెల్లిస్తారు.