మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటు చేసుకుంది. మృతులను గురుశేఖర్‌రెడ్డి(45), దస్తగిరమ్మ(38) దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురులక్ష్మి(10)గా గుర్తించారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు హుటాహుటిన శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు.