ఒక్క బైక్‌పై నలుగురు ప్రయాణం.. క్లాస్ పీకిన ఎమ్మెల్యే

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు ట్రాఫిక్ నిబంధనలు పాటించని ఒక కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యాంప్ కార్యాలయానికి వెళ్తుండగా, చౌటిపల్లి వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై నలుగురు ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులను గమనించి, కాన్వాయ్‌ను ఆపి ప్రమాదాల గురించి హెచ్చరించారు. అనంతరం, ఎమ్మెల్యే ఆ కుటుంబంలోని భార్య, మరో మహిళను తన కారులో ఎక్కించుకుని సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చారు.

సంబంధిత పోస్ట్