నాలుగేళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌

AP: విజయనగరం జిల్లా గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో స్క్రబ్‌ టైఫస్‌ కేసు నమోదైంది. బొండపల్లి మండలం మారువాడ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారికి జ్వరం, అలసట లక్షణాలున్నాయి. వైద్యులు పరీక్షలు చేయగా.. స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. గ్రామస్తులకు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.

సంబంధిత పోస్ట్