AP: కూటమి అధికారంలోకి రాగానే జగనన్న కాలనీల్లో జరిగిన మోసాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. విచారణను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణశాఖ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి చిత్రాలు తీసి. అందులో వివరాలు నమోదు చేస్తున్నారు.