అగర్‌బత్తీ తయారీ పేరుతో కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు

AP: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఘరానా మోసం బయటపడింది. సత్య సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో నిరుద్యోగులు, పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఇంటి వద్ద నుండే డబ్బు సంపాదించవచ్చని SMలో ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయలు కాజేసిన ఘటన వెలుగుచూసింది. వరదా కృష్ణమోహన్, గేదెల సంధ్యారాణి అనే వ్యక్తులు ఈ సంస్థను స్థాపించి, అమాయకుల చేత డిపాజిట్లు చేయించుకుని, ఆపై పత్తా లేకుండా పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు ఉండగా, నలుగురు బ్రాంచ్ మేనేజర్ల ద్వారా రూ. 3.60 కోట్ల మేర మోసం జరిగినట్లు తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్