ఏపీలోని మహిళలకు ఆర్డీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అతి త్వరలోనే దీనిపై శుభవార్త చెప్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యమైందని అన్నారు. చిత్తూరు ఆర్టీసీ డిపోలో 17 నూతన బస్సులను ఆయన ఇవాళ ప్రారంభించారు.