ఉచిత దుస్తుల దుకాణం.. 3వేల మందికి సాయం

AP: విశాఖపట్నానికి చెందిన విజయ్, నీరజ దంపతులు, స్నేహితులతో కలిసి సమాజ సేవలో భాగంగా ఉచిత దుస్తుల దుకాణాన్ని ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబరులో మొదలైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 3వేల మందికి అవసరమైన వస్త్రాలను అందించారు. ఈ దుకాణం కేవలం ఆదివారాల్లో మాత్రమే తెరిచి ఉంటుంది. దాతలు ఇచ్చే వస్త్రాలతో పాటు, ఎలక్ట్రికల్ వస్తువులు, వంట సామాగ్రి, షూస్ వంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాతల ఇంటి నుంచే వస్త్రాలను సేకరించి, శుభ్రం చేసి, ఇస్త్రీ చేసి అందించడం వీరి ప్రత్యేకత.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్