AP: రాష్ట్రంలో బుధవారం నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు కానుంది. చేనేత కళాకారుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు నెలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 93,000 మగ్గాల కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయి. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది.