నేటితో ఉచిత గ్యాస్ సిలిండర్‌ బుకింగ్ గడువు పూర్తి

AP: దీపం–2 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్ రెండో విడత బుకింగ్‌కు గడువు జులై 31తో ముగియనుంది. ఇంకా బుక్ చేయని లబ్ధిదారులు తక్షణమే నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు దాటితే బుకింగ్‌ సాధ్యం కాదు. మూడో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు ఉంటుంది. బ్యాంక్‌ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో లబ్ధిదారులు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఆధార్‌ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అవ్వడం తప్పనిసరి.

సంబంధిత పోస్ట్