70 ఏళ్ళు దాటిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం : మంత్రి డోలా

AP: మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంపై మంత్రి సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, మీసేవా, మనమిత్ర ద్వారా సదరం స్లాట్ బుకింగ్ కు చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్లాట్ బుకింగ్ రోజు నుంచి నెలలోగా ధ్రువపత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇబ్బందుల్లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలన్నారు. 70 ఏళ్లు దాటిన వారికి PMJAY వందన ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్